మైకులు పరిమితి మించితే కేసులే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

మైకులు పరిమితి మించితే కేసులే!


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం కోసం మైకులను హోరెత్తిస్తుంటారు. ఆట, పాటలతో పెద్ద శబ్దాలతో ప్రచారం సాగిస్తారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలను పెట్టినట్లయితే సంబంధిత అభ్యర్థిపై కేసులు పెడతారు. నివాసప్రాంతాల్లో 45–55 డెసిబుల్స్, వైద్యశాలలు, విద్యాలయాలు, న్యాయస్థానాల ప్రాంతాల్లో 40–50 డెసిబుల్స్, వ్యాపారప్రాంతాల్లో 55–65 డెసిబుల్స్, పారిశ్రామిక ప్రాంతాల్లో 70–75 డెసిబుల్స్‌ శబ్దం మాత్రమే వినియోగించాలనేది ఎన్నికల సంఘం నిబంధన. కానీ ఈ నిబంధనను ఎంతమంది పాటిస్తారో చూడాలి. 

No comments:

Post a Comment

Post Bottom Ad