సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు క్లీన్ చిట్ వచ్చిందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు క్లీన్ చిట్ వచ్చిందా?


సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్తానాలు ఒకరిమీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించి, వారిపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)తో విచారణ చేయిస్తుంది. అయితే అలోక్‌ వర్మపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సీవీసీకి నిర్దేశించిన గడువు పూర్తవడంతో విచారణ నివేదికను నేడు సుప్రీంకోర్టుకు సీవీసీ అందించనుంది. అయితే విచారణలో అలోక్‌ వర్మకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని తెలుస్తున్నప్పటికీ సీల్డ్ కవర్లో ఉన్న నివేదికలో బయల్పడేవరకు వేచి చూడాల్సిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad