ఎట్టకేలకు హాస్యనటుడు వేణుమాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేసేందుకు వచ్చిన వేణుమాధవ్ తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు తన మద్దతు దారులతో మరోసారి వచ్చి స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని అందుకే కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్ తెలిపారు.
Post Top Ad
Monday, November 19, 2018
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment