సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే భారత్‌ ఢీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 20, 2018

సెమీస్‌లో ఇంగ్లండ్‌తోనే భారత్‌ ఢీ

Team-India-Head-To-head-With-England-In-Women's-t20-World Cup
వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ సెమీస్‌లో తలపడే  ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ నెల 23న శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆదివారం అర్ధరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన ఇంగ్లండ్‌... గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్‌ ‘బి’ టాపర్‌ భారత్‌ను ఆ జట్టు ఎదుర్కోనుంది. తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌తో , ఆస్ట్రేలియా తలపడనుంది.

No comments:

Post a Comment

Post Bottom Ad