వర్మ వివరణ లీకేజీపై సుప్రీం ఆగ్రహం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

వర్మ వివరణ లీకేజీపై సుప్రీం ఆగ్రహం

Supreme-Court-Serious-On-Alok-Verma
సీవీసీ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ ఇచ్చిన వివరణ లీకవడంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలోక్‌వర్మ కేసును మంగళవారం రెండు పర్యాయాలు విచారించిన ధర్మాసనం.. సీవీసీ సహా తాము ఎవరి వాదనలను ఆలకించబోమని, నివేదిక విషయంలో గోప్యత పాటించాలని ఆయా పక్షాలకు సూచించింది. దీనిపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నతాధికారులపై సీబీఐ డీఐజీ మనోజ్‌సిన్హా చేసిన ఆరోపణలు క్రైం థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad