స్మగ్లింగ్‌ కేసులో ప్రముఖ శ్రీలంక క్రికెటర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

స్మగ్లింగ్‌ కేసులో ప్రముఖ శ్రీలంక క్రికెటర్‌

Smuggling-Case-Filed-On-Farmer-Cricketer-Jayasurya
ప్రముఖ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నాడు. శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వక్కలను తరలించాడంటూ జయసూర్యతో పాటు మరో ఇద్దరు లంక క్రికెటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.  నాగపూర్‌ కేంద్రంగా జరుగుతున్న నకిలీ, నాసిరకం వక్కల తయారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఇటీవల తనిఖీలు జరిపారు. కేసు విచారణలో జయసూర్య పేరు సంచలనంగా బయటకు వచ్చింది. భారత అధికారుల నుంచి అందిన లేఖ మేరకు శ్రీలంక ప్రభుత్వం తదుపరి విచారణ కూడా జరపనుంది.  మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై జయసూర్య ఖండిచాడు. న్యాయపరంగా ఎదర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాని తెలిపాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad