నేను బాగానే ఉన్నా.. ఇలాంటి రూమర్స్‌ సృష్టించొద్దు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 23, 2018

నేను బాగానే ఉన్నా.. ఇలాంటి రూమర్స్‌ సృష్టించొద్దు

Rajasekhar-Injured-In-Kalki-Shooting
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను యాంగ్రీహీరో రాజశేఖర్‌ ఖండించారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని ఓ ప్రెస్‌నోట్‌ ద్వారా వెల్లడించారు. పదిరోజుల క్రితం కల్కి షూటింగ్‌లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌, మనాలీకి వెళ్లామని మధ్యలో కొండ చర్యలు విరిగి పడటంతో గాయపడ్డానని తెలిపారు.  దేవుడి దయతో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. తన ఆరోగ్యం విషయం గురించి అభిమానులు, కుటుంబీకుల నుంచి విపరీతంగా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, తన ఆరోగ్యం గురించి ఇంతగా ఆరాతీస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇక తన ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులు సృష్టించొద్దని కోరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad