40 పరుగుల్లోనే అంతా అవుట్! ఎనిమిది వికెట్లు తీసిన యాసిర్ షా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

40 పరుగుల్లోనే అంతా అవుట్! ఎనిమిది వికెట్లు తీసిన యాసిర్ షా!


దుబాయ్‌లో పాకిస్తాన్తో రెండో టెస్టు ఆడుతున్న న్యూజీలాండ్ చెత్త రికార్డులను నమోదు చేసింది. పాక్ బౌలర్ యాసిర్‌ షా మాయాజాలానికి కివీస్ జట్టు కుదేలైంది. 418/5 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన పాక్‌ తర్వాత ఇన్నింగ్స్లో కివీస్‌ను 90 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే ఓపెనర్‌ జీత్‌ రావల్‌ వికెట్‌తో బోనీ కొట్టిన యాసిర్ షా 8-41 దెబ్బకు కివీస్‌ 90కే ఆలౌట్‌ అయ్యింది. కివీస్‌ జట్టులో ఆరుగురు డకౌట్‌ అయింది. ఫాలోఆన్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఓపెనర్లను కూడా యాసిర్ అవుట్ చేయడం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad