టీ20ల్లో పాకిస్తాన్‌ రికార్డు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, November 03, 2018

టీ20ల్లో పాకిస్తాన్‌ రికార్డు

Pakistan-New-Record-In-T20-Cricket

టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్‌ రికార్డు సృష్టించింది. వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా పాక్‌ అవతరించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇది పాకిస్తాన్‌కు వరుసగా 8వ టీ20 విజయం. ఆఫ్గానిస్తాన్‌ వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి ఆ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, పాక్‌ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి తరువాతి స్థానంలో నిలిచాయి. వరుసగా సిరీస్‌లు గెలిచిన జాబితాలో భారత్‌ 6టీ20 సిరీస్‌లను గెలిచి పాక్‌ తర్వాత నిలిచింది.

No comments:

Post a Comment

Post Bottom Ad