చంద్రబాబుకు మావోల లేఖ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 06, 2018

చంద్రబాబుకు మావోల లేఖ


Moist-Open-letter-To-Cm-Chandrababu-Naidu


ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ రాశారు. చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు నమ్మరని ఏవోబీ ఎస్‌జెడ్‌సీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగబంధు ఆ లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొనసాగుతున్న గిరిజనుల అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధకాండకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగబంధు డిమాండ్‌ చేశారు. ఏజెన్సీలో కూంబింగ్‌ల పేరుతో గ్రామాల మీద ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ధ్వజమెత్తారు. అన్యం పుణ్యం ఎరుగని గిరిజనుల ఇళ్లలోకి ప్రవేశించి తిండి గింజలను ధ్వంసం చేస్తున్నారని వాటిని తక్షణమే మానుకోవాలని సూచిస్తూ సోమవారం పాడేరులో 5 పేజీల లేఖ విడుదల చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad