సెమీస్‌లో మేరీ, లవ్లినా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

సెమీస్‌లో మేరీ, లవ్లినా

Mary-Kom-Entered-In-Semi-Final
మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. భారత స్టార్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ తొలిసారి ఈ టోర్నీలో పాల్గొంటున్న లవ్లినా బొర్గహైన్‌ సెమీస్‌ చేరుకోగా, మనీషా మౌన్‌,  కచరి భాగ్యబతి ఇంటిబాట పట్టారు. 48 కేజీల లైట్‌ వెయిట్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్‌ విభాగంలో బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ 5–0తో వు యు(చైనా)ను చిత్తు చేసింది. తద్వారా ఈ క్రీడల్లో వరుసగా ఏడో పతకం ఖాయం చేసుకుంది. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకూ ఆరు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించిన మేరీ ప్రస్తుతం సెమీస్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad