కృనాల్‌ ఖాతాలో రెండు రికార్డులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

కృనాల్‌ ఖాతాలో రెండు రికార్డులు

Krunal-Pandya-Two-New-Records-In-Aus-Series
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత ఆల్‌ రౌండర్‌ కృనాల్‌ పాండ్యా రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. అందులో ఒకటి బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ-20లో నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కృనాల్ అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌ గడ్డపై టీ-20ల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కృనాల్ పాండ్యా రికార్డు సృష్టించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad