మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 01, 2018

మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌

సబ్సిడీ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. రూ.2.94 పెరిగడంతో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధర  బుధవారం అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో రూ.505.34కు చేరుకుంది. సబ్సిడీయేతర ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.60 పెరిగి రూ. 880కు చేరింది. జూన్‌ నుంచి సబ్సిడీ సిలిండర్‌ ధర పెరగడం ఇది వరుసగా ఆరో సారి కావడం గమనార్హం. మార్కెట్‌లో ఇంధన ధరల ఆధారంగా ఎల్పీజీపై జీఎస్టీని గణిస్తారు. ధరపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్నును మాత్రం మార్కెట్‌ రేట్‌ ప్రకారం చెల్లించాలి. దీని వల్లే తాజాగా ఎల్పీజీ ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad