గుండెపోటుతో బాలసాయిబాబా మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 27, 2018

గుండెపోటుతో బాలసాయిబాబా మృతి

Bala-Sai-Baba-Died-With-Heart-Attack
కర్నూలు జిల్లాకు చెందిన బాలసాయిబాబా గుండెపోటుతో మరణించారు. బంజారాహిల్స్‌లోని విరంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఆశ్రమంలో బాలసాయిబాబాకు సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు కు చెందిన బాలసాయిబాబా తనకు తాను అవతారంగా ప్రకటించుకుని గత కొన్ని దశాబ్దాలుగా భక్తులకు బోధనలు చేస్తూ... జీవితం గడుపుతున్నారు. బాలసాయి భౌతిక కాయానికి కర్నూలులోని ఆశ్రమంలో మహాసమాధి చేయనున్నట్టు భక్తులు తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad