తప్పు నాదే అంటున్న ఆమీర్‌ఖాన్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 27, 2018

తప్పు నాదే అంటున్న ఆమీర్‌ఖాన్‌

Aamir-Khan-Says-Sorry-To-Fans
బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ ఘోరంగా నిరాశాపరిచింది. నిర్మాత, బయ్యర్లలకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే దీనపై ఆమిర్‌ఖాన్‌ ఎట్టకేలకు స్పందించాడు. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ ప్లాప్‌ అవడానికి తానే కారణమని, ఆ తప్పును తనమీదే వేసుకున్నాడు. సినిమా అభిమానులు, ప్రేక్షకులను అలరించలేపోయినందుకు క్షమాపణలను కోరాడు. దీనిపై సినిమా రంగం ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ స్పందిస్తూ.. ఈ ఆటలో గెలుపోటములు సహజమని అన్నాడు. ఓటమిని ఒప్పుకోవడం చాలా కొద్దిమంది స్టార్స్‌లోనే చూశానని ఆమిర్‌కు ఎంతో ధైర్యం ఉందన్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad