ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 26, 2018

ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి

9-Spot-Killed-In-Himachal-Pradesh-Road-Accident
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సిర్మౌర్‌లో ఓ ప్రైవేటు బస్సు  అదుపుతప్పి జలాల్‌ వంతెనపై నుంచి నదిలో పడడంతో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు శ్రీ రేణుకాజీ ప్రాంతం నుంచి నాహాన్‌కు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అడిషనల్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

No comments:

Post a Comment

Post Bottom Ad