ఒకే బైక్‌కు 136 చలాన్లు! రూ.31,590 ఫైన్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 02, 2018

ఒకే బైక్‌కు 136 చలాన్లు! రూ.31,590 ఫైన్లు!


ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని రోడ్డు పక్కన బైక్ పెట్టి టిఫిన్ చేస్తున్నారా? హెల్మెట్‌ లేకుండా బండి నడుపుతున్నారా? డ్రైవింగ్‌ చేస్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నారా? అయితే మీ చెవిలో చలాన్ల మోత మోగినట్లే. హైదరాబాద్లోని ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు పాటించని వారి తాట తీస్తున్నారు. సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ చలాన్‌లు జారీ చేస్తున్నారు. ఓ బండికి ఏకంగా 136 చలాన్‌లు వేసి, రూ.31,590ల ఫైన్లు వేశారు. వీటిలో 127 చలాన్లు హెల్మెట్‌ లేకుండా వాహనం నడపడం వల్ల జారీ అయిననే ఉండటం గమనార్హం. 

No comments:

Post a Comment

Post Bottom Ad