నమ్ముకున్న వ్యక్తికి టికెట్ ఖరారు చేసిన వైఎస్ జగన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

నమ్ముకున్న వ్యక్తికి టికెట్ ఖరారు చేసిన వైఎస్ జగన్!


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందాలంటే.. డబ్బులుండాలి అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు ఇలాంటి విష ప్రచారానికి పాల్పడుతూ ఉన్నాయి. అయినా టికెట్లు అమ్ముకుని సొమ్ములు చేసుకున్న నేపథ్యం ఉన్న వారు ఇలా మాట్లాడుతూ ఉండటం విడ్డూరమే. వారి విష ప్రచారం సంగతలా ఉంటే.. వాస్తవంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తూ ఉన్నారో మరో సంఘటన స్పష్టం చేస్తూ ఉంది.

పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయనగరం అభ్యర్థిని ఖరారు చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కొలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. ఆయనను ఆశీర్వదించాలని కోరారు.  విజయనగరం జిల్లాలో వైసీపీ తరఫున తొలి అభ్యర్థిగా నిలుస్తున్నారు కొలగట్ల.

మరి ఇప్పుడు కొలగట్లకు ఉన్న అర్హతలు ఏమిటి? డబ్బు.. అని చెప్పగలరా? పార్టీ పట్ల విధేయత, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిబద్ధత, ప్రజల్లో ఉన్న సానుకూలత.. ఇవే కొలగట్లకు వైసీపీ టికెట్ దక్కేలా చేస్తున్నాయి.

కొలగట్ల చివరి సారిగా నెగ్గింది 2004లో మాత్రమే. ఆ తర్వాత మరోసారి అశోక్ గజపతి రాజుకు గట్టి పోటీనే ఇచ్చారు కానీ ఓడిపోయారు. గత ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడేమీ కాదు. అయితే పార్టీలో నిబద్ధతతో పని చేస్తున్న వ్యక్తిలకు ప్రాధాన్యతను ఇస్తామని జగన్ ఈ విధంగా సంకేతాలు ఇచ్చారు. వైసీపీ టికెట్ల విషయంలో కామెంట్లు చేసే వాళ్లకు ఈ విషయం అర్థమవుతోందా?

No comments:

Post a Comment

Post Bottom Ad