అందుకే అరవింద సమేత ఆడియో ఫంక్షన్ కు రాలేదు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

అందుకే అరవింద సమేత ఆడియో ఫంక్షన్ కు రాలేదు


టాలీవుడ్ నయా సంచలనం.. పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ మొదట అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆడనప్పటికీ మెగా హీరోలు వరుణ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా దువ్వాడ జగన్నాథమ్ లో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ ఒక్క చిత్రంలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన పూజా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నాయికగా దూసుకుపోతోంది. ఇప్పటికే మహేశ్ బాబు సరసన నటిస్తున్న పూజ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కూడా ఎంపికైంది. దసరాకు విడుదల కానున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అరవింద సమేతలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పూజా గైర్హాజరు అయింది. దీంతో పూజా రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని రకరకాల గాసిప్పులు వినిపించాయి. ఈ గాసిప్పులు తనదాకా వచ్చాయామో మరి పూజా ట్విట్టర్ లో వివరణనిచ్చింది. వేరే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ లో ఉండిపోవాల్సి వచ్చిందని, శాయశక్తులా పంక్షన్ కు రావడానికి ప్రయత్నించానని తెలిపింది. హాజరు కాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని పేర్కొంది.  

No comments:

Post a Comment

Post Bottom Ad