ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జోరు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జోరు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు


ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో తన జోరు కొనసాగిస్తోంది. భారీ ఎత్తున ఆ జిల్లాల్లో నాయకులు పార్టీలో చేరుతున్నారు. తాజాగా పి.గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాక వరప్రసాదరావు.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మాల సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల చేరికలతో జనసేన బలం పుంజుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉండగా అత్యధిక సీట్లు కొల్లగొట్టే యోచనతో పవన్ కల్యాణ్ వడివడిగా ముందుకు కదలుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad