తీరం దాటిన టిట్లీ తుపాను - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

తీరం దాటిన టిట్లీ తుపాను


ఉత్తరాంధ్రను వణికిస్తున్న 'తిత్లీ' పెను తుపాను శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద ఈరోజు ఉదయం తీరాన్ని దాటింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుపాను
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉధృత రూపం దాల్చింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్నిచోట్లా అంధకారం అలుముకుంది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల తీవ్రతకు విద్యుత్, సెల్ పోన్లు టవర్లు, చెట్లు నేలకొరిగాయి. మత్స్యకారుల పడవలు, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, సముద్రం చాలా అలజడిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే విశాఖలో సముద్రం 30 అడుగుల మేర ముందుకుచొచ్చుకు వచ్చింది. సముద్ర తీర ప్రాంతమంతా అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆర్కే బీచ్ లో సందర్శకులను అనుమతించలేదు. ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad