భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి


అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్‌ ఆష్కిన్‌ (96), ఫ్రాన్స్‌కు చెందిన జెరార్డ్‌ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్‌లాండ్‌ (59)లకు ఈ ఏడాది నోబెల్‌ భౌతిక శాస్త్ర బహుమతి దక్కింది. ఆర్థర్ ఆష్కిన్ నోబెల్ బహుమతి అందుకుంటున్న అతి పెద్ద వయస్కుడు కావడం విశేషం. భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్‌లాండ్‌ కావడం మరో విశేషం. స్ట్రిక్‌లాండ్‌ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్‌ మాయెర్‌కు భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతి దక్కింది. నోబెల్‌ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్‌ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్‌ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్‌ మోరో, డొనా స్ట్రిక్‌లాండ్‌లకు ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad