తన ప్రేయసిని చంపుతానంటే ఈ హీరోకి చాలా కోపం వచ్చిందట - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

తన ప్రేయసిని చంపుతానంటే ఈ హీరోకి చాలా కోపం వచ్చిందట


బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ దీపికా పదుకోణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.14 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. అదేవిధంగా ఆమె ప్రియుడు, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా టాప్ పొజిషన్ లోనే ఉన్నాడు. చాలాకాలం నుంచి వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది నవంబర్ లోనే ఇటలీలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వీరి వివాహం జరుగుతుందనే వార్తలు వస్తున్నా వీరిద్దరూ ఆ వార్తలను ఖండిస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దీపికా, రణవీర్ అనేక విషయాలు పంచుకున్నారు. మీడియా ఇప్పటికే చాలాసార్లు తామిద్దరి పెళ్లి చేసేసిందని రణ్ వీర్ నవ్యుతూ వ్యాఖ్యానించగా దీపికా సిగ్గుల మొగ్గ అయింది. అదేవిధంగా పద్మావత్ చిత్రం విడుదలప్పుడు దీపికాని చంపుతామని కొందరు బెదిరిస్తుంటే తనకు చాలా కోపమొచ్చేదని ప్రేయసిపై రణ్ వీర్ తన ప్రేమను చాటుకున్నాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad