Video Of Day

Breaking News

కపూర్ల కుటుంబంలో విషాదం


ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్ కపూర్ సతీమణి కృష్ణ రాజ్ కపూర్ (88) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు రాజ్ కపూర్ మనవరాలు రిధిమా కపూర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కృష్ణ రాజ్ కపూర్ కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ నటులు.. రణ్ ధీర్ కపూర్ (హీరోయిన్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లకు తండ్రి) రిషికపూర్ (బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు తండ్రి), ప్రముఖ నటుడు, దర్శకుడు రాజీవ్ కపూర్ ఈమె కుమారులే.  రాజ్ కపూర్ మనవడు రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ హీరోగా రాణిస్తున్నాడు. కాగా, చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన కృష్ణ రాజ్ కపూర్ రెండో కుమారుడు రిషి కపూర్ తల్లి మరణవార్త తెలిసి హుటాహుటిన తిరుగుప్రయాణమయ్యారు. కృష్ణా రాజ్‌కపూర్‌ మృతిపట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.

No comments