మీటూ ఉద్యమానికి ఏఆర్ రెహమాన్ మద్దతు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 24, 2018

మీటూ ఉద్యమానికి ఏఆర్ రెహమాన్ మద్దతు!



దేశ వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మీటూ ఉద్యమం నేపథ్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు ధైర్యంగా తన అనుభవాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి ఏఆర్ రెహమాన్ మద్దతు ప్రకటించారు. బాధితులకు ధైర్యం, శక్తి చేకూరాలని, వారు నిర్భయంగా బయటకు వచ్చి పోరాటం చేయాలని ఆకాంక్షించారు.  అయితే ఆరోపణలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని’ రెహమాన్ తన ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమ చాలా స్వచ్ఛంగా ఉండానుకుంటానని రెహమాన్ చెప్పారు. మహిళలకు గౌరవం దక్కాలని భావిస్తానన్నారు. మీటూ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తుల పేర్లు విని తాను షాకైనట్లు కూడా తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad