డేటింగ్ యాప్ లో ప్రియాంకా చోప్రా పెట్టుబడులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

డేటింగ్ యాప్ లో ప్రియాంకా చోప్రా పెట్టుబడులు


గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఒకవైపు బాలీవుడ్, మరోవైపు హాలీవుడ్ మూవీస్ తో దూసుకుపోతోంది. తన ప్రియుడు, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ భామ త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన సంపదను మరింతగా పెంచుకునే చర్యలు చేపట్టింది. ప్రముఖ డేటింగ్ యాప్ 'బంబుల్'లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. అమెరికాకు చెందిన ఒక మహిళ నడుపుతున్న ఈ డేటింగ్ యాప్ అచ్చంగా మహిళల కోసం ఉద్దేశించింది. అదేవిధంగా టెక్నాలజీ బేస్డ్ స్టార్టప్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ భామ సిద్ధమవుతోంది. అంతేకాకుండా సొంతంగానూ ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉందట.. ఈ ముద్దుగుమ్మ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రియాంకాకు చక్కగా సరిపోతుందేమో కదూ!

No comments:

Post a Comment

Post Bottom Ad