నరసింహ ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

నరసింహ ఆలయంలో జనసేనాని ప్రత్యేక పూజలు


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సభలకు ప్రజలను వెళ్లనీయకుండా తెలుగుదేశం నేతలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్రజలు పవన్ సభలకు తండోపతండాలుగా హాజరవుతున్నారు. కాగా, సోమవారం ఉదయం పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేతం ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయానికి చేరుకున్న పవన్ నరసింహస్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఉదయాన అయితే భారీ ఎత్తున అభిమానులు, ప్రజలతో రద్దీ చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పవన్ ఎవరికీ తెలియకుండా ఆలయ పర్యటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమవుతారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad