పంచాయతీ సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేశ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

పంచాయతీ సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి లోకేశ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జరిగిన సభలో ప్రసంగించిన పవన్.. లోకేశ్ పంచాయతీ సర్పంచ్ గా కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు గెలుస్తామనే నమ్మకం లేకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలనలో ఉన్నట్టు ఇందిరమ్మ కమిటీలు, తెలుగుదేశం పాలనలో ఉన్నట్టు జన్మభూమి కమిటీలు ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు సర్పంచ్ లేరని అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రం ఉన్నారని పరోక్షంగా లోకేశ్ ను దెప్పిపొడిచారు.

No comments:

Post a Comment

Post Bottom Ad