అరకులో ఉప ఎన్నిక ఉండదు: కేంద్ర ఎన్నికల సంఘం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

అరకులో ఉప ఎన్నిక ఉండదు: కేంద్ర ఎన్నికల సంఘం


విశాఖపట్నం జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టీకరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల కిందట అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మేల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అరకు ఉప ఎన్నిక ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది వేసవిలో జరిగే సాధారణ ఎన్నికలతోపాటే అరకు స్థానానికి ఎన్నికలు జరుగుతాయని స్పష్టీకరించినట్టైంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad