Video Of Day

Breaking News

తనుశ్రీ దత్తాకు లీగల్ నోటీసులు పంపిన నానాపటేకర్


కొన్నేళ్ల కిందట ఒక సినిమా షూటింగ్ సందర్బంగా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఇటీవల ఆరో్పించి సంచలనం సృష్టించింది.. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. అయితే ఈ ఆరోపణలను నానాపటేకర్ ఖండించడమే కాకుండా ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో పలువురు బాలీవుడ్ భామలు తనుశ్రీ దత్తాకు మద్దతు తెలపగా, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటివారు స్పందించకుండా సైలెంట్ గా ఉండిపోయారు. కాగా, నానాపటేకర్ తను శ్రీ దత్తాకు సోమవారం లీగల్ నోటీసులు పంపారు. ఆమె చేసిన ఆరోపణలకు, అవాస్తవాలకు తనకు క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో నానా డిమాండ్ చేశారు. 

No comments