విశాఖ జిల్లాలో టీడీపీ వర్సెస్ నందమూరి అభిమానుల వార్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

విశాఖ జిల్లాలో టీడీపీ వర్సెస్ నందమూరి అభిమానుల వార్


విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో 'అరవింద సమేత' సినిమా టికెట్ల వ్యవహారం టీడీపీ నేతలు, నందమూరి అభిమానుల మధ్య గొడవను రాజేసింది. వివరాల్లోకెళ్తే.. పాయకరావుపేట సాయిమహల్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'అరవింద సమేత' నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నందమూరి అభిమానులు థియేటర్ కు వెళ్లి టికెట్లు కావాలని కోరగా థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. 'మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అనిత మీకు టికెట్లు ఇవ్వొద్దన్నా'రని థియేటర్ మేనేజర్ చెప్పడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా తాము నందమూరి అభిమానులమేనని, వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టామని.. తమకు టికెట్లు ఇవ్వకపోవడమేంటని మండిపడ్డారు. తమకు టికెట్లు ఇవ్వనప్పుడు తాము కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఎందుకంటూ చించేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad