మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం.. 'రైతు' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం.. 'రైతు'


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. కాగా, 152వ చిత్రంగా 'రైతు' పేరుతో చిరు సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ.. మెగాస్టార్ కోసం సామాజిక సందేశంతో కూడిన ఒక అద్భుత కథను సిద్ధం చేసినట్టు వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కొరటాల.. మెగాస్టార్ కు కథ వినిపించగా ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. ఆ మేరకు కథలో కొరటాల శివ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచి షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా నటించే ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad