కాంగ్రెస్ ను గెలిపిస్తే మూన్నెళ్లకో సీఎం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

కాంగ్రెస్ ను గెలిపిస్తే మూన్నెళ్లకో సీఎం


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూన్నెళ్లకో సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించాల్సిన అవసరముందో విద్యార్థులకే ఎక్కువ ఎరుక ఉందని అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ భేటీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహా కూటమిని చూసి తామేమీ భయపడటం లేదని, ఒక్క దెబ్బకు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలను కొట్టే చాన్స్ వచ్చిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదిక మీదే తెలంగాణ ఏర్పడిందని.. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad