రాహుల్ గాంధీతో ఆ హీరోయిన్ డేటింగ్ కు వెళ్లాలనుకుందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

రాహుల్ గాంధీతో ఆ హీరోయిన్ డేటింగ్ కు వెళ్లాలనుకుందా?


బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డేటింగ్ కు వెళ్లాలనుకుందా? అంటే అవుననే అంటున్నారు.. ప్రముఖ జర్నలిస్టు రషీద్ కిద్వాయి. ఆయన తాను రాసిన 'నేతా అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్'లో అనేక సంచలన విషయాలు వెల్లడించారు. కరీనా కుటుంబానికి, రాహుల్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరీనా రాహుల్ ను ఇష్టపడేవారని, ఆయనతో డేటింగ్ చేయాలని ఉబలాటపడేదని రషీద్ తెలపడం గమనార్హం. రాహుల్ గాంధీ కూడా కరీనా కపూర్ సినిమా విడుదలైతే తొలి రోజే చూసేవారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో కరీనా ఒక టీవీ షోకు ఇంటర్వ్యూ ఇస్తూ తాను రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతానని తెలపడం విశేషం. అయితే ఆ తర్వాత కరీనా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు దగ్గరవ్వడం అతడితో పబ్లిగ్గా చేసిన లిప్ లాకులు వైరల్ అవ్వడం తెలిసిన సంగతే.
షాహిద్ తో సంబంధాన్ని తెంచుకున్న తర్వాత కరీనా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కు దగ్గరై అతడ్ని వివాహమాడింది. ఈ దంపతులకు తైమూర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.



No comments:

Post a Comment

Post Bottom Ad