నెనెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు: కాజోల్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

నెనెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు: కాజోల్


తన సినీ జీవితంలో తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని స్పష్టం చేసింది.. బాలీవుడ్ బామ కాజోల్. ప్రముఖ నటుడు అజయ్ దేవ్ గణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్లాక్ బ్యూటీ పెళ్లయ్యాక కూడా సెలక్టివ్ గా కథాప్రాధాన్యమున్న చిత్రాలను మాత్రమే చేస్తోంది. తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగంగా మీడియా కాజోల్ స్పందన కోరగా ఈ భామ పై వ్యాఖ్యలు చేసింది. తాను లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు కానీ కొంతమందికి లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయని వెల్లడించింది. తనుశ్రీ దత్తా ఆరోపణలు కూడా నిజమే అయ్యిండొచ్చని వివరించింది. అయితే బాధితులు ఎవరైనా హాలీవుడ్ లో 'మీటూ' ఉద్యమంలా ఇక్కడ కూడా ధైర్యం బయటకు వచ్చి వారి పేర్లు వెల్లడించాలని కోరింది.

No comments:

Post a Comment

Post Bottom Ad