నీ అందం.. నా ప్రేమ గీతం గోవిందం.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

నీ అందం.. నా ప్రేమ గీతం గోవిందం..


2008లో లక్ష్మీకల్యాణం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. కాజల్ అగర్వాల్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ అమ్మడికి మంచి అవకాశాలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'మగధీర' చిత్రంతో టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా మారిపోయింది.. కాజల్. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, బృందావనం, ఖైదీ నెంబర్ 150, నాయక్, చందమామ, బిజినెస్ మేన్ తదితర చిత్రాలతో ఆమె కెరీర్ గ్రాప్ ఒక రేంజులో దూసుకుపోయింది. ప్రస్తుతం తమిళంలో ఈ భామ హిందీ సినిమా క్వీన్ రీమేక్ గా తెరకెక్కుతున్న 'పారిస్ పారిస్' చిత్రంలోనూ, తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఫొటో షూట్ చూస్తే సినిమాల్లోకి ప్రవేశించినప్పుడు ఆమె ఎలా ఉందో... ఇప్పుడూ అలాగే ఉండటం విశేషం. ఆ రేంజులో ఈ భామ గ్లామర్ మెయిన్ టైన్ చేస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad