ప్రభాస్ ఎవరో తెలియదన్న మరో హీరోయిన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 04, 2018

ప్రభాస్ ఎవరో తెలియదన్న మరో హీరోయిన్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరో తెలియనివారు ఉండరు. బాహుబలి - ది బిగినింగ్, బాహుబలి- ద కన్కూజ్లన్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ తో కలిసి సాహో సినిమాలో నటిస్తున్నాడు. కాగా, ప్రభాస్ ఎవరో తనకు తెలియదంటూ బాంబు పేల్చింది.. 'లవ్ యాత్రి' హీరోయిన్... వారిన హుస్సేన్. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్న 'లవ్ యాత్రి'లో సల్మాన్ సోదరి అర్పిత భర్త ఆయుష్ శర్మ హీరోగా పరిచయం అవుతుండగా, హీరో్యిన్ గా వారిన హుస్సేన్ నటిస్తోంది. అతి త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారిన హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేసింది. బాహుబలి చూశానని అయితే ప్రభాస్ ఎవరో తెలియదంది. గతంలోనూ కేరళ బొద్దుగుమ్మ నిత్యామీనన్ 'ప్రభాస్ ఎవరూ' అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిన హుస్సేన్ ఇలా మాట్లాడటంతో పక్కనే ఉన్న హీరో ఆయుష్ శర్మ కల్పించుకుని హీరోయిన్ వారినా ఆప్ఘనిస్తాన్ కు చెందిన అమ్మాయని, ఇక్కడ నటుల గురించి తెలియదని సర్దిచెప్పాడు. ఆమె తరఫున తాను క్షమాపణ చెబుతున్నానన్నాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad