హైదరాబాద్లో అద్దెరేట్లు.. బీజేపీ కునికిపాట్లు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

హైదరాబాద్లో అద్దెరేట్లు.. బీజేపీ కునికిపాట్లు!


ముంబై, బెంగళూరు, చెన్నై తదితర నగరాలతో పోల్చితే తక్కువ అద్దెలున్నటువంటి హైదరాబాద్లోనూ ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంటి యజమానులు వివిధ సాకులు చూపి తరచూ అద్దెలు పెంచుతుండటం, లేదా ఉన్నవారిని ఖాళీ చేయించి కొత్తవారికి ఎక్కువ మొత్తానికి ఇంటిని అద్దెకు ఇస్తుండటం నిత్యకృత్యమైంది. ఒకప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబం అద్దెకు ఉండాలంటే ఐదు వేల రూపాయల్లోనూ ఇల్లు దొరికేది. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ తదితర ఖర్చులు కలుపుకుని కనీసం పదివేల రూపాయలు పెడితే కానీ ఇల్లు దొరికే పరిస్థితి లేదు. అద్దెకు ఉంటున్న కుటుంబాలకు ప్రతి నెలా రూ.5 వేల వరకు ఇంటి అద్దె చెల్లిస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచిందంటే అద్దెల ప్రభావం ఏ మేరకు ఉందో తెలుస్తోంది. సగటు ఉద్యోగి తన వేతనంలో దాదాపు నాలుగో వంతు డబ్బు కేవలం అద్దెలకే ఖర్చు పెడుతుండటం గమనార్హం. 

No comments:

Post a Comment

Post Bottom Ad