Video Of Day

Breaking News

ఔర్‌ ఏక్‌ డక్కా.. ఏక్‌ లాక్‌ పక్కా


పద్నాలుగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న మంత్రి తన్నీరు హరీష్ రావు ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని, కేవలం ప్రతిపక్ష హోదాపైనే రాష్ట్రమంతా చర్చ జరుగుతోందని అన్నారు. మన మెజారిటీ 90 వేల దగ్గరే ఆగుతోంది. ఈ సారి ‘ఔర్‌ ఏక్‌ డక్కా.. ఏక్‌ లాక్‌ పక్కా’ లెక్క లక్ష మెజారిటీ దాటి చరిత్ర సృష్టించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహుల పార్టీ తెలుగుదేశం, కోదండరాం పార్టీ టీజేఎస్, సీపీఐల మహాకూటమికి ఓటేస్తే మన వేలితో మనకంటిని పొడుచుకున్నట్లేనని అన్నారు. జెండా.. ఎజెండా లేని అతుకుల బొంత అని విమర్శించారు. అలాంటి కూటమిని గెలిపిస్తే తెలంగాణ ప్రజలది మళ్లీ బానిస బతుకే అవుతుందని హెచ్చరించారు.

No comments