గీతగోవిందం 50 రోజులు ఎన్ని సెంటర్లంటే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

గీతగోవిందం 50 రోజులు ఎన్ని సెంటర్లంటే..


గీతా ఆర్ట్స్ 2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించిన గీతగోవిందం నేటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. మీడియం బడ్జెట్ సినిమాగా విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుత కలెక్షన్లు కొల్లగొట్టింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్, రూ.65 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ప్రస్తుత రోజుల్లో 50 రోజులు ఆడటమే గగనమై పోతున్న పరిస్థితుల్లో గీతగోవిందం మొత్తం 59 సెంటర్లలో 50 రోజులు ఆడటం గమనార్హం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad