కేసీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ పోటీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

కేసీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ పోటీ

ప్రజా యుద్ద నౌక.. గద్దర్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో గద్దర్ కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. గద్దర్ మహాకూటమి అభ్యర్థిగా గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ నుంచి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీకి దించే యోచనలో భాగంగా గద్దర్ ను బరిలోకి దింపనున్నారు. గద్దరు పోటీ చేయకుంటే మాజీ ఎమ్మెల్యే, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad