ఫన్నీ ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

ఫన్నీ ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ!


తాజాగా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై స్పందించి వివాదాలు మూటగట్టుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు కాస్త ఫన్నీగా స్పందించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహిళలు శానిటరీ నాప్కిన్లను స్నేహితుల ఇంటికి కూడా తీసుకెళ్లం కదా మరి దేవాలయాలకు ఎలా తీసుకెళ్తారు అంటూ శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఉద్దేశించిన ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఆమెను విమర్శించారు. ఈ నేపథ్యంలో తాను గతంలో నటించిన ఓ సీరియల్‌లోని మూతికి గుడ్డతో కట్టి, చేతులు, కాళ్లూ కూడా కట్టి ఉన్న ఓ ఫన్నీ ఫోటోను షేర్‌ చేస్తూ... ‘నేను ఏమైనా మాట్లాడితే మళ్లీ వాగుడుకాయ అంటారు’ అంటూ కామెంట్ పెట్టింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad