ఎన్నికల షెడ్యూల్ టీఆర్ఎస్కు కలిసొచ్చేనా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 07, 2018

ఎన్నికల షెడ్యూల్ టీఆర్ఎస్కు కలిసొచ్చేనా?


ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎన్నికల కమిషన్ నిర్ణయం ఒకింత మింగుడు పడడం లేదు. ప్రభుత్వాన్ని రద్దుచేసిన వెంటనే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ నవంబర్లోనే ఎన్నికలు వస్తే, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకెళ్లొచ్చని భావించింది. అయితే తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించనుండడంతో ప్రతిపక్షాలకు సైతం కొంత సమయం దొరికినట్లైంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన అధికార పార్టీ అభ్యర్థులు ఎక్కువ సమయం ప్రచారం చేయాల్సివస్తోండడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయితే సమయం ఎక్కువ ఉండడం మంచిదే అంటూ మరికొందరు అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad