అతడిలో ఆ చీకటి కోణం కూడా ఉంది: డింపుల్ కపాడియా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

అతడిలో ఆ చీకటి కోణం కూడా ఉంది: డింపుల్ కపాడియా


బాలీవుడ్ ముద్దుగుమ్మ తనుశ్రీదత్తాను లైంగికంగా వేధించిన బాలీవుడ్ నటుడు నానాపటేకర్ పై మరో బాలీవుడ్ వెటరన్ నటీమణి విరుచుకుపడింది. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా భార్య డింపుల్.. నానాపై ధ్వజమెత్తిన వీడియో ఒకటి వెలుగుచూసింది. ఇది ఒక సినిమా ఇంటర్వ్యూ సందర్భంగా 2010లో డింపుల్ ఇచ్చిందిగా తెలుస్తోంది. ఈ వీడియోలో 'నానా గొప్ప నటుడు. అతడి నటన చూస్తే అతడి తప్పులన్నింటిని క్షమించేయాలని అనిపిస్తోంది. అతడు వంద మర్డర్లు చేసినా మర్చిపోవాలనిపిస్తుంది. అంతేకాకుండా మనం కూడా అతడి కోసం చనిపోవాలనిపిస్తుంది. అతడి నటనకు సాటివచ్చేవారు ఎవరూ లేరు. అయితే అతడిలో కూడా ఒక చీకటి కోణం ఉంది' అంటూ డింపుల్ బాంబుపేల్చింది. తాను కూడా అతడితో చాలా సినిమాల్లో కలసి నటించానని, అందరి మాదిరిగానే అతడిలోనే ఒక చీకటి కోణం ఉందని తెలిపింది. కానీ అతడి అద్భుత నటన చూస్తే మాత్రం నానా ఇలాంటి పనులు చేశాడంటే నమ్మడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad