గోల్‌ కొట్టాడు.. ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

గోల్‌ కొట్టాడు.. ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు !


వెనిజులా ఫుటాబాల్‌ ఆటగాడు గోల్‌కొట్టిన ఆనందంలో తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేసి ముద్దులతో ముంచెత్తాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సీడీ అంటోఫగస్తా జట్టుకు చెందిన ఎడ్వర్డ్ బెల్లో చీల్స్‌ ఈవెర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గోల్ సాధించిన ఆనందంలో సరాసరిగా గ్యాలరీలోని తన ప్రియురాలి వద్దకు పరుగెత్తి వేలికి రింగు పెట్టి ప్రపోజ్‌ చేశాడు. దీనికి ఒప్పుకోవడంతో ఆమె చెంపలను ముద్దులతో తడిపాడు. ఇక గ్యాలరీలో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ ఆకస్మిక ఘటనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ జంటను చప్పట్లతో అభినందించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad