రెండో వారంలో ప్రవేశించిన దేవదాస్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 06, 2018

రెండో వారంలో ప్రవేశించిన దేవదాస్


యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం.. దేవదాస్. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన హీరోయిన్లుగా నటించారు. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం శనివారంతో రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 కోట్ల షేర్, రూ.41 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విజయదేవరకొండ హీరోగా వచ్చిన నోటా అట్టర్ ప్లాప్ కావడంతో దేవదాస్ కు వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మళ్లీ ప్రమోషన్లు నిర్వహిస్తోంది. హీరోలు నాని, నాగార్జునలతోపాటు హీరోయిన్లతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇప్పించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad