ఎ1 నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 25, 2018

ఎ1 నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను రూ. 3,500 కోట్ల ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలతో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎ1 నిందితుడిగా చార్జిషీట్లో పేర్కొంది. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్‌. భాస్కరణ్(కార్తీ), ఎయిర్సెల్ మాజీ సీఈఓ వి. శ్రీనివాసన్‌తోపాటు మరో 9 మందిని నిందితులుగా ఈడీ చార్జ్‌షీట్‌లో చేర్చింది. ఈ చార్జిషీటును నవంబర్ 26న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారించనున్నారు. అయితే సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో నవంబరు  29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad