ఈసారి చంద్రబాబు పోటీ ఇక్కడ నుంచే! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

ఈసారి చంద్రబాబు పోటీ ఇక్కడ నుంచే!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. చంద్రబాబు 1989 నుంచి కుప్పం నుంచే పోటీ చేసి వరుసగా గెలుస్తున్నారు. ఈసారి తన కుమారుడు నారా లోకేశ్ ను కుప్పం నుంచి పోటీ చేయించి, తాను తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం వాస్తవానికి చంద్రగిరి. అయితే అక్కడ 1983లో ఓడిపోయిన అనుభవం ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి బలమైన ప్రత్యర్థి ఉండటంతో చంద్రబాబు తిరుపతి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అయితే తిరుపతిలో బలిజ (కాపు) ఓటర్లు ఎక్కువ. వీరంతా ఈసారి జనసేన పార్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad