నీ కాటుక కళ్లు.. కాటుక కళ్లు కవ్విస్తున్నాయే.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

నీ కాటుక కళ్లు.. కాటుక కళ్లు కవ్విస్తున్నాయే..


భూమిక చావ్లా టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఖుషీ, శివాజీ సరసన మిస్సమ్మ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన సింహాద్రి, ప్రిన్స్ మహేశ్ బాబు సరసన ఒక్కడు, మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ తదితర చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టింది. తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, భోజ్ పురి చిత్రాల్లోనూ నటించి మంచి పేరు సాధించింది. ప్రముఖ యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. కొన్నాళ్లు సినిమాలకు విరామమిచ్చిన ఈ సుందరి ఇటీవలే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ చిత్రంలో, సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యూటర్న్ లోనూ భూమిక కీలక పాత్ర పోషించింది. అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న సవ్యసాచిలోనూ ఈ భామ నటిస్తోంది. ఈ నేపథ్యంలో హాట్ ఫొటో షూట్లతో అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. నాలుగు పదుల వయసు వచ్చినా ఏమాత్రం తగ్గకుండా క్రేజీ లుక్స్ తో అభిమానులను ఫిదా చేస్తోంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad