కొనసాగుతున్న అయ్యప్ప భక్తుల నిరసనలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

కొనసాగుతున్న అయ్యప్ప భక్తుల నిరసనలు


శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ అయ్యప్ప భక్తులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఆలయ సాంప్రదాయ నియమాల్లో, హిందూ మతానికి సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు జోక్యం తగదని భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాల్లో ఎలాంటి జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత మూడు రోజుల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళలో అయ్యప్ప భక్తులు జాతీయరహదారులను దిగ్బంధించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. అంబులెన్సులను తప్ప ఏ వాహనాన్ని కదలనీయడం లేదు. 

No comments:

Post a Comment

Post Bottom Ad